గాదని వత్తు రెచ్చట నికామమధర్మము గూడుకట్టె నా
పాదులు పెల్లగించుటకు వత్తురు గాని యా ధర్మ లక్షణం
బాదిమమూర్తులా ప్రభువులైన నెఱుంగుదురంతియే సుమీ.
లోకం బాపని యీపనిం బొనరుచున్ లోకుల్ ప్రమాణంబుగా
నా కార్యంబులె ధర్మమంచుఁగొని దేశాచారమైనట్టుల
స్తోకంబౌ పరిపాటి ధర్మమని యెంచున్ ధర్మమో నిత్యమో
క్షాకారాభిముఖంబుగా నడుచు జీవాధ్వైక సూక్ష్మస్థితిన్.
తార వాలిని సుగ్రీవునితో యుద్ధానికి వెళ్ళవద్దని వారించి, శ్రీరాముని గురించి, ఇక్ష్వాకుల ధర్మవర్తనాన్ని గురించి చెప్పింది.
" రాముని వంటివారు ఊరకే రాజ్యాన్ని త్యజించి యెందుకు అడవులు పట్టి వస్తారు? ఎక్కడైతే అధర్మం గూడు కట్టుకొని ఉందో, దాని పాదులని పెళ్ళగించటానికి వస్తారు. ధర్మానికి ప్రథమావతారులైన వారు అధర్మ లక్షణాన్ని గుర్తుపడతారు. అంతే సుమా !
లోకంలో బ్రతుకుతున్న జీవులను ప్రమాణంగా తీసుకొని, లోకం కూడా ఆ పనో యీ పనో చేస్తూ ఉంటుంది. లోకం కూడా ఆ చేయబడ్డ పనులే ధర్మమని, అదే ఉన్నతమైన దేశాచారమని భావిస్తూ ఉంటుంది. కానీ ధర్మమనేది నిత్యమైన మోక్షమనే దానికి అభిముఖంగా జీవుల మార్గాన్ని నిర్దేశిస్తూ , సూక్ష్మమార్గంలో అంతుచిక్కని రీతిలో నడుస్తూ ఉంటుంది. "
శ్రీరాముడు సూర్యవంశానికి చెందినవాడు. సూర్యుడికి వివస్వంతుడు అని పేరు. సూర్యుని కొడుకు వైవస్వతమనువు. అతని కుమారుడు ఇక్ష్వాకువు. అందువల్ల, ఇక్ష్వాకులు సూర్యవంశానికి ఆదిమూర్తులు, ప్రభువులు, ధర్మావతారులు.
తార వివేకవంతురాలు. ధర్మసూక్ష్మాలు తెలిసినది. అందుకనే, సుగ్రీవునితో కయ్యాన్ని నివారించే ప్రయత్నంలో భాగంగా, ధర్మసూక్ష్మాన్ని విడమరచి చెప్పింది.
ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, కిష్కింధా కాండము, గజపుష్పి ఖండము లోనివి.
No comments:
Post a Comment