గ్రమునా గాఢచలత్పరిభ్రమణ రేఖన్ స్థైర్య మాభాసమై
యమరన్ జూచుచుఁజూచుచుండఁ దల బర్వై తూలిపోనైన దే
హముగా నెన్నిగిరాట్లు నన్నిడెదొ క్రీడాసక్త ! విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని తొంభై ఏడో పద్యం.
" విశ్వేశ్వరా ! గిర గిరా తిరగటం కోసం గిరాటు వేసిన బొంగరము, అది తిరిగే గీత నుండి ప్రక్కకు తొలగినట్లుగా, స్థిరత్వాన్ని కోల్పోయి, చూసతూ చూస్తుండగానే తల బరువై తూలిపోతున్నట్లుగా ఉన్నటువంటి దేహమాత్రునిగా, నన్నెన్ని గిరాట్లు పడేస్తావు? ఆటల్లో నీకు చాలా ఆసక్తి ఉందని నాకు తెలుసు స్వామీ ! "
ఈ పద్యంలో ' పునరపి జననం, పునరపి మరణం ' అన్నట్లు, బొంగరాల ఆటలో రుచి మరగినవాడు, బొంగరాన్ని పదే పదే గిరాటు వేస్తున్నట్లు, కర్మఫలాన్ని అనుభవింప చేయటానికి, పరమేశ్వరుడు జీవులను జనన మరణ చక్రంలో పడవేసి తిప్పుతున్నాడు. ఈ జన్మ పరంపరలు ఎప్పటికి తప్పుతాయని మహాకవి పరమేశ్వరుణ్ణి వేడుకొంటున్నారు.
No comments:
Post a Comment