చన కుంభచ్ఛవి రమ్య పింగళజటా సంభారు రుద్రాక్షహా
రుని, గుంభాభమహోదరోన్నతశరీరున్ క్షుత్ప్రకోపాకృతిన్
గనినాఁడిల్వలుఁ డంచఱేనినడకల్ గా వచ్చు కుంభోద్భవున్.
ఇది శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అరణ్య కాండము, దశవర్ష ఖండము, వాతాపి ఇల్వలుల కథకు సంబంధించినది.
దేవతలకు, విప్రులకు, ఏ కష్టాలొచ్చినా అగస్త్యమహర్షి గుర్తుకు వస్తాడని, అందుకనే, తానే స్వయంగా వచ్చానని బ్రహ్మదేవుడు అగస్త్యునితో వాతాపి ఇల్వలుల గురించి చెప్పాడు.
" అలా చెప్పిన మరునాడే, అరణ్యమార్గంలో వెళ్తున్న వానిని , బాహువుల దగ్గర నుంచి తొడల వరకు మొత్తం బాగుగా బలిసి బంగారం రంగు కాంతితో మెరిసిపోతున్న వానిని, అందంగా పింగళవర్ణంలో (గోరోజనం రంగు) నున్న జడలసమూహంతో నున్న వానిని, రుద్రాక్షమాలలు ధరించిన వానిని, కుండ వంటి పెద్ద పొట్టతో ఉన్నవానిని, ఆకలి చేత కోపంతో నిండిన వానిని, రాజహంస లాగా మెల్లగా నడిచి వచ్చే వానిని, కుంభసంభవుడైన అగస్త్యుడిని ఇల్వలుడు చూశాడు. "
' అంచఱేనినడకల్ గా వచ్చు కుంబోద్భవున్ ' . ఎంత అందమైన ప్రయోగం ! పొట్టిగా ఉండి, పెద్ద పొట్టతో ఉన్నవాడు మెల్లగా నడుస్తాడు. దానిని ఇంత అందంగా చెప్పటం మహాకవి విశ్వనాథకే సాధ్యం.
మిత్రావరుణులు మార్గమద్యంలో ఊర్వశిని చూసి స్ఖలనం పొందారు. ఆ వీర్యాన్ని ఊర్వశి ఒక కుండలో ఉంచింది. అగస్త్యుడు, వశిష్ఠుడు కుండ నుంచి పుట్టారు. అందువలన వారికి కుంభసంభవులనే పేరు వచ్చింది.
No comments:
Post a Comment