శ్రీముఖుడాంధ్ర రాజకుమారుడు. ఆంధ్రులు త్రేతాయుగము నుండి ప్రత్యేకజాతిగా నేర్పడినవారు. పూర్వము యయాతి యని మహారాజు కలడు. శుక్రాచార్యుని కొమార్తె యైన దేవయానిని పెండ్లాడినవాడు. వృషపర్వుని కూతురు శర్మిష్ఠ కూడ నాయన భార్యయే. ఈ యయాతి కైదుగురు పుత్రులు. వారిలో ననువు పేరు గల వాడొకడు. ఆ వంశములో బలి యను రాజు పుట్టెను. ఆయన భారతదేశమున తూర్పు ప్రాంత మంతయు పాలించుచుండెను. దానికి ప్రాచ్యకదేశ మని పేరు. ఆ బలి కాఱుగురు కుమారులు. అంగరాజు, వంగరాజు, కళింగరాజు, సుహ్మరాజు, పుండ్రరాజు, ఆంధ్రరాజు. ఆ బలి తన యీ యార్గురు కుమారులకు తన భాగమైన ప్రాచ్యకదేశ మంతయు విభాగించి పంచిపెట్టెను. కృష్ణగోదావరీనదుల నడుమనున్న యీ దేశ మాంధ్రరాజు వంతు వచ్చెను. నాటి నుండి యీ దేశమున కాంధ్రదేశమని పేరు వచ్చెను. "
- కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, " భగవంతుని మీద పగ ", పురాణవైరగ్రంథమాల:1
No comments:
Post a Comment