లా కేళీనలినాకరాచ్ఛజల వేలా కేలికాసక్త బా
లా కర్పూరకపోలఫాలరుచిజాల స్రస్తచేల స్ఫుర
త్ప్రాకారాకృతిమత్కుచద్వితయసంభారాలు, విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని ఎనభయ్యో పద్యం.
ఈ పద్యం నాల్గు పాదాలు ఒకే ఒక దీర్ఘ సంస్కృత సమాసంగా ఉంది. సంస్కృత భాషాపరిజ్ఞానం లేని నా వంటి వాడికి పద్యార్థాన్ని అన్వయించుకోవటం కష్టం. అయినా చిన్న ప్రయత్నం చేస్తున్నాను. పాఠకులు మన్నిస్తారని, పెద్దల ద్వారా, నా తప్పులు సరిదిద్దబడి, సరియైన అర్థం మీకు లభిస్తుందని ఆశిస్తున్నాను.
" విశ్వేశ్వరా ! నీ కరుణ ఎటువంటిదో చేసి చూపిస్తాను. చల్లని నీటితో నిండి, తేలియాడుతున్న పద్మాలకు నివాసమైన స్వచ్ఛమైన సరోవరాల గట్ల మీద ఆడుకొంటున్న కన్యల యొక్క కర్పూరతాంబూలంతో నిండియున్న బుగ్గల నిగ్గులతో, జారుతున్న పైటకొంగుల చాటున ఉన్నతంగా కనిపించే స్తనద్వ్యయం యొక్క సంపూర్ణత్వాన్ని గుర్తుచేసేటటువంటిది నీ కరుణ. "
శివుడు అర్థనారీశ్వరుడు. ఆయన వక్షస్థలం సంగీత, సాహిత్య నృత్య, నాట్యవిశేషాలకు ఆటపట్టు. జీవితానికి సంపూర్ణత్వాన్ని కలిగించేది.
No comments:
Post a Comment