ష్టములున్ బండినఁగాని నీకు నది నచ్చన్ బోదఁటట్లుండెఁబో
క్రమమేలా గయికోవు చావొకటియేగా తక్కు వా వెన్క స
ర్వము నెగ్గించితి వద్దిగూడఁ బ్రియమా? రానిమ్ము, విశ్వేశ్వరా ! "
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని ఎనభై ఐదో పద్యం.
" విశ్వేశ్వరా ! చెడుబుద్ధి కలిగిన దుర్మార్గుని పాపాలు, భక్తుని యొక్క కష్టాలు బాగా పండితే గానీ నీకు నచ్చదనుకొంటాను. సరే, అదట్లా ఉండనీ ! దేనికైనా ఒక పద్ధతి ఉండాలి కదా ! నే ననుభవించే కష్టాల్లో చావొక్కటేగా తక్కువ. అన్నీ నువ్వనుకున్నట్లుగానే జరిగాయి. నా చావు కూడా నీకు ప్రియమైతే, అది కూడా రానీ ! "
భగవంతుడిని పరిపూర్ణంగా నమ్మిన భక్తుడు, ఆవేశంలో భక్త రామదాసు లాగా ఏవేవో మాట్లాడుతుంటాడు. అది అతని భక్తికి పరాకాష్ఠ. ఈ నిందాపూర్వక భక్తిలో, భక్తునికి భగవంతునికి మధ్య గల ఆత్మానుసంధానం బహిర్గతమౌతుంది.
No comments:
Post a Comment