నీ కోదండవినిర్గతాశుగములన్ హింసింతు నెవ్వండు కా
నీ కాదన్నను, గోసలావనిఁ గలం డెవ్వండు? గాధేయ శి
క్షా కూలంకష శస్త్రసంచలదుపజ్ఞన్ దట్టుకోఁజాలగన్.
పినతల్లి కైకేయి కోరిక మేర, తండ్రి ఆజ్ఞను పాలిస్తూ వనవాసానికి సిద్ధమయ్యాడు రాముడు. ఈ వార్త విన్న కౌసల్య దుఃఖంతో నిండిపోయింది. లక్ష్మణుడు కోపవివశుడయ్యాడు.
" నాకు రాముడే దేవుడు. ఆయన అడవులు పట్టి పోతే, నేను చూడలేను. ఎవరడ్డమొచ్చినా, నా ధనుర్బాణాలతో శిక్షిస్తాను. ఈ కోసల రాజ్యంలో నన్ను ఆపగల వాడెవ్వడు? విశ్వామిత్ర మహర్షి శస్త్రవిద్యా శిక్షణలో సంపూర్ణతను సాధించిన నా నేర్పును ఎవరు తట్టుకోగలరో చూస్తాను. "
సుమిత్ర కౌసల్యకు ఎంత సమీపవర్తియో, రామునికి లక్ష్మణుడు అంత సన్నిహితుడు. లక్ష్మణుడు ఉపాసనాస్వరూపుడు. ఆయన రామోపాసనా దురంధరుడు. రాముడిని లక్ష్మణుడిని వేరుగా చూడలేము. అందుకే ఆయన కంత మనస్తాపము.
ఈ పద్యం శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అయోధ్యా కాండము, అభిషేక ఖండము లోనిది.
No comments:
Post a Comment