తులకున్ నాకు నిరాదృతి స్ఫుట తపో ధూఃక్లుప్తి సామాన్యమై
వెలసెన్ నాకును నమ్మవారికిని నీ ప్రేమం బొకే రీతి ని
మ్ములుగా భాగము పంచిపెట్టెదవు పోపో ! స్వామి ! విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని తొంభై రెండో పద్యం.
" విశ్వేశ్వరా ! నీ తలపై నున్న చంద్రరేఖ క్రొత్త వెలుగులో, ఆ పర్వతరాజ పుత్రిక పార్వతికి, నాకు ఒకే రకమైన ఫలితం, నిరాదరణ రూపంలోను, నిష్టతో చేస్తున్న తపస్సుకు భoగం రూపంలోను కలిగింది. నాకు, అమ్మవారికి నీ ప్రేమ ఒకేరీతిగా భాగాలు విరివిగా పంచిపెడతావు. పో స్వామీ ! ఇదేం పద్ధతి. "
పార్వతి, శివుణ్ణి భర్తగా పొందదలచి తీవ్రమైన తపస్సు చేసింది. విశ్వనాథ కవితారూప తపస్సు చేశారు. పార్వతి తపస్సు ఎంతో కాలానికి గాను ఫలించలేదు. విశ్వనాథ పరమేశ్వరుని మీద అల్లిన శతకం పూర్తి కాలేదని వాపోతున్నారు. శివుని నుండి వారు పొందిన ఫలితం ఒకేరీతిలో ఉందని భావం.
No comments:
Post a Comment