క్ష్వాకుల బిడ్డ యాతఁడు రసాతల సర్వదిశాభిరక్షులి
క్ష్వాకులు సూర్యదీధితి భవం బగు తేజము సర్వలోక ధ
ర్మాకృతి పూర్వకల్పనిభమై స్మరియించిన నాటినుండియున్.
ఈయన యేమొ సూర్యులకు నెల్లర కాదిమ సూర్యుఁడైన య
ట్లాయతధర్మమూర్తి ప్రభువై పితృవాక్యరహస్యచాలనం
బై యరుదెంచెఁబో స్మృతిగతార్థము స్పష్టము చేసినట్లుగా
నాయెడ వేదమార్గముల కర్థము చెప్పు మహర్షికల్పుఁడై.
శ్రీమద్రామాయణ కల్పవృక్షము, కిష్కింధా కాండము, గజపుష్పి ఖండము లోని ఈ పద్యాలు పరిశీలిస్తే తార యెంతటి విచక్షణా శీలం కలిగినదో, ధర్మతత్త్వజ్ఞురాలో అర్థమౌతుంది. రాముని గురించి, భర్త యైన వాలితో ఆమె చెప్పిన మాట లివి.
" సరే ! శ్రీరామచంద్రుని మహిమల ప్రసక్తి కొంచెం సేపు అక్కడ పెట్టు. ఆయన ఇక్ష్వాకుల సంతతి. ఇక్ష్వాకు లంటే పాతాళలోకం మొదలుపెట్టి అన్ని లోకాలను రక్షించేవాళ్ళు. సూర్యమండలాంతర్గతమైన తేజస్సును అన్నీ లోకాల్లో ధర్మం రూపంలో ఎన్నో కల్పాల నుంచి పాలిస్తున్నవారు.
ఇక ఈయన సంగతి చెబుతాను విను. ఈయన విశ్వాంతరాళంలో వెలిగే సూర్యుల కందరికీ సూర్యుడు. మూర్తీభవించిన ధర్మస్వరూపం. స్మృతులలో ఉన్న అర్థాలను విశదీకరిస్తున్నట్లుగా, పితృవాక్య పరిపాలన చేస్తూ ఇక్కడకు వచ్చిన ప్రభువు. వేదాలకు అర్థం చెప్పేటటువంటి మహర్షికల్పు డాయన. "
తార యొక్క ధర్మయుక్తమైన యీ మాటలు వింటే ఆమె పంచకన్యలలో ఏ విధంగా స్థానాన్ని పొందిందో, ఆమె నామస్మరణ చేస్తే ఏ విధంగా పాపవిముక్తులమౌతామో అర్థమౌతుంది.
No comments:
Post a Comment