ఫైకోన్మాదిత సర్వతః పరివృత ప్రారంభగీతీ లస
న్మాకందాగ్రలతాంతపత్ర విగళన్మారంద కల్లోలినీ
వ్యాకీర్ణాంబుకణ ప్రసేక శిశిరత్వం బందు విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని ఎనభై రెండో పద్యం.
" విశ్వేశ్వరా ! నీ దయ ఎంతటిదో చాటి చెబుతాను తండ్రీ ! ఆడుకోయిలలు గొంతు విప్పే వేళ, మత్తెక్కిన గండు తుమ్మెదల ఝంకారాలు పరిసరా లంతటా వ్యాపించగా, గున్నమామిడి చిగురుటాకులు ప్రకాశిస్తుండగా, పూవులనుండి మధు ధారలు జాలువారుతుండగా, మంచు బిందువులతో పువ్వులు తడిసిపోగా, శోభాయమానంగా ఉన్న శిశిరత్వంలో, నీ కరుణ దాగి ఉంది ప్రభూ ! "
ఋగ్వేద సంహిత భాగమైన రుద్రాధ్యాయం, ప్రకృతి లోని సమస్త వస్తుజాలంలో శివుని యొక్క అంతర్యామిత్వం నెలకొని ఉన్నదని సుస్పష్టంగా తెలియజేస్తున్నది.
No comments:
Post a Comment