నని భీతావహమైనతో సుతుని యందై మోహపుంబెల్లు, కా
మిని తొల్లింటిది నన్ ప్రశస్తపథగామిన్ జేయు దానిన్ దొలం
చిన మార్గానఁ దొలంచి నా విహపరశ్రేయస్సు, విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని తొంభై ఎనిమిదో పద్యం.
" విశ్వేశ్వరా ! ఇంతకు ముందు లేనటువంటి లోభ మనే దొకటి నాలో కనపడుతూ ఉంది. వార్థక్యం ముంచుకొస్తుందనే భయతో, కొడుకు మీద మోహ మెక్కువయింది. నన్ను మంచి దారిలో నడిపిస్తున్న నా మొదటి భార్యను తీసుకువెళ్ళిపోయినట్లే, నా కొడుకును కూడా తీసుకువెళ్ళిపోయి, నాకు ఇహపర సుఖాలు లేకుండా చేశావు. "
విశ్వనాథవారికి ప్రథమ కళత్ర వియోగం జరిగింది. ఆమె స్మృతి చిహ్నంగా వరలక్ష్మీ త్రిశతి అనే అద్భుతమైన స్మృతికావ్యాన్ని వారు రచించారు. తరువాత, పదహారు, పదిహేడేళ్ళున్న ఒక కుమారుడు కూడా చనిపోయాడు. ఆ దుఃఖకాలం లోనే, కిన్నెరసాని పాటలు వ్రాశానని విశ్వనాథవారే ఒక ఆకాశవాణి ఇంటర్వ్యూలో కేశవపంతుల నరసింహశాస్త్రిగారితో చెప్పారు.
No comments:
Post a Comment