ధా ! కాపర్దశిఖాధునీ స్వనితగాథా ! విశ్వనాథా ! భవ
చ్ఛీకంఠాభరణంబు చెప్పెదను రాజీవంబులోఁ దేనియల్
కైకోనే కయికోని క్రొత్త సిరి వాఁకల్ గట్ట విశ్వేశ్వరా !
ఇది ' మాస్వామి (విశ్వేశ్వర శతకం) లోని తొంభయ్యొకటో పద్యం.
" విశ్వేశ్వరా ! ఈ కొద్దిపాటి కావ్యం ఇట్లా అయినా కూడా ఏమీ బాధ లేదు లేవయ్యా ! నీ గొంతులో, లోకకళ్యాణార్థం దాచుకొన్న హాలాహలాన్ని కంఠాభరణంగా మలిచి నీలకంఠుడివయ్యావు చూశావూ, అటువంటి నీకు, తామరపూల నుండి జాలువారే తేనెలు కూడా ఇవ్వలేని క్రొత్త తీయదనాన్ని, సొగసులను ఇచ్చే బృహత్కావ్యాన్ని, జగత్కళ్యాణప్రదంగా, కానుకగా ఇస్తాను. "
విశ్వనాథ శ్రీమద్రామాయణ కల్పవృక్షము అనే మహాకావ్యరచన చేసి పరమేశ్వరాంకితం చేశారు.
విశ్వనాథ, శివుని పరంగా చాలా అందమైన సంబోధనలను, విశేషణాలను వాడుతారు. వేధ అంటే బ్రహ్మ, విష్ణువు, పండితుడు అనే అర్థా లున్నాయి. సదాశివుడు త్రిమూర్త్యాత్మకుడు, సర్వజ్ఞుడు.
" కాపర్దశిఖాధునీ స్వనిత గాథా ! "చాలా అందమైన ప్రయోగం. కపర్ది అంటే చిక్కుముడులు కల కేశపాశములు కలవాడు, శివుడు. ఆ జటావనుల్లో సుడులు తిరుగుతూ, గర్జిస్తున్నది ఆకాశగంగ. గంగావతరణ కథావస్తువు శివుడు. స్వనితము అంటే శబ్దము, గర్జన.
No comments:
Post a Comment