యాకారుల్ కుజనుల్, బహిస్సుధలు లోనగ్నుల్ మఱీ లో స్వయం
పాక శ్రీపరిపాకులే సుజనుల లప్పా ! యింత దుర్మార్గ మీ
లోకం బింతకు నేను జాలను దయాళూ ! పాహి ! విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని ఎనభై ఏడో పద్యం.
" విశ్వేశ్వరా ! ఈ చెడ్డవాళ్ళు, లోపల ఎలా ఉంటారో, దానికి ఎన్నో రెట్లు ఎక్కువగా పైకి మాయవేషాలు వేస్తుంటారు. వీళ్ళందరూ పైకి మాత్రం, మాటల్లో తేనెలు చిలికిస్తుంటారు, లోపల మాత్రం నిప్పులు కురిపిస్తుంటారు. మరి ఇటువంటి స్వయంపాకం చేసుకొనే, ముదిరిపోయిన జనాలు సన్మార్గులుగా చెలామణి అవుతున్నారు తండ్రీ ! ఇంత దుర్మార్గపు లోకాన్ని నా వంటివాడు తట్టుకోలేడు. అందుకే శరణు కోరుతున్నాను స్వామీ ! "
లోకంలో దుర్మార్గం, కుటిలత్వం, మాటకారితనం, క్రౌర్యం, ముఖ్యంగా, స్వార్థం పెరిగిపోయాయి. అటువంటి లోకంలో, ధర్మానికి కట్టుబడిన, ఋజుప్రవర్తన కలిగిన, అన్యాయం కళ్ళబడ్డప్పుడు, ఉన్నదున్నట్లుగా మాట్లాడేవారిని, ఎందుకూ పనికిరానివారిగా, నోటిదురుసువారిగా జమకడుతున్నారు. ఆ విషయాన్నే స్వానుభవంతో విశ్వనాథ చక్కగా యీ పద్యంలో వివరించారు.
No comments:
Post a Comment