సర్వమానవుల హృదయాంతరాళములయందు నొక విచిత్రమైన యసంప్రదాయమైన పరిచితాభార బాహిరమైన యొక రేఖను దీర్చిదిద్దుకొనును. నగరము, జనపదము, నరణ్యము ఈ మూడింటి యొక్క పరిస్థితులు, వాని వాని శోభలు, నవి యవి కలిగించు మనోభావములు, భిన్నభిన్నములుగా నుండును. అడవిలోని సెలయేటికి మహానదికి, దీర్చిదిద్దిన కాలువకు, బంటబోదెకు గల భేదము పరిణాహవేగములయందే గాక సౌందర్య విశేషము నందొక భేదమున్నది. ఈ సౌందర్య విభేదము నెట్లు చెప్పవచ్చును? ఒక పెద్ద యడవి యున్నది. ఇంకొక యడవి మహాపర్వతము మీద నున్నది. దాని శోభ దానిదే. దీని శోభ దీనిదే. అందుకనియే కాబోలు, కాళిదాసు శకుంతలను జూచి యుద్యానవన శోభను వనలతలు దూరీకరణము చేయుచున్నట్లున్నదని వర్ణించినాడు.
- కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ: నాస్తికధూమము: పురాణవైర గ్రంథమాల:2
No comments:
Post a Comment