క్షోభాకంపిత దేహయష్టి పులకాశ్రుస్వేద రూపంబుగాఁ
బ్రాభాతాంబుజ మట్లు నూత్న మధుహర్ష శ్రీధునీ వీచికా
క్షోభంబందెడుఁ దండ్రి ! యింత కృపయా చూపింతు విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని తొంభయ్యో పద్యం.
" విశ్వేశ్వరా! నా అదృష్టం ఇట్లా ఉంది. వంద పద్యాలైనా పూర్తి కాలేదు. బాధతో, కలతతో, కంపిస్తున్న యీ శరీరం పులకించి, కన్నీటి రూపంలోను, స్వేదంగాను, ఉదయకాలంలో, క్రొత్త తేనెవాకలతో, నదీతరంగాలపై నుండి వీచే గాలితో, పులకించిపోయిన పద్మంలాగా, కలత చెందుతున్నది ప్రభూ ! నా మీద ఇంత దయ చూపిస్తావా తండ్రీ ! "
విశ్వనాథవారు, ఆత్మాశ్రయ ధోరణిలో, జీవుని వేదనను తెలియజేస్తూ, భక్త్యావేశంలో వ్రాసిన పద్యాలివి. ' వంద పద్యాలు లేని ' అని అన్నారు కానీ, నూటొక్క పద్యాలున్న, శతక లక్షణాలున్న మహోత్కృష్ట కావ్యం ' మా స్వామి ' .
No comments:
Post a Comment