గులపై నప్పుడు నిద్రలేచితినయా, కుక్షింభరిన్ దేవులా
టలతో వెళ్ళెను నాల్గుజాలు, నిశితోడన్ స్వేంద్రియజ్ఞానమున్
వెలితయ్యెన్ మఱియిద్ది యేమి బ్రదుకో వెళ్ళింతు? విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని తొంభై ఐదో పద్యం.
" విశ్వేశ్వరా ! పద్మబాంధవుడైన సూర్యుడు ఆకాశమార్గం అంచుల మీద అందంగా కొలువుతీరాడు. నే నప్పుడు నిద్ర లేచానయ్యా ! ఇక అక్కడనుంచి పొట్ట నింపుకొవటానికి పడే తిప్పలతో నాలుగు జాములు గడిచిపోయాయి. రాత్రయ్యేటప్పటికి ఇంద్రియాలకు కూడా వెలితయ్యాను (ఇంద్రియ విజృంభణ యెక్కువయింది). మరి ఇది ఏ రకమైన బ్రతుకును సాగించటమో స్వామీ ! "
ఈ పద్యంలో, సంసారజీవుల పరిస్థితిని కళ్ళకు కట్టినట్లు చూపించారు విశ్వనాథ. లేవటం, తిండితిప్పల కోసం ఉరుకులాడటం, తినటం, నిద్ర పోవటం - ఇదీ సంసారజీవుల దైనందిన కార్యక్రమం. మరి భగవంతుని తలచుకొనే దెప్పుడు?
No comments:
Post a Comment