Tuesday, 22 September 2020
సువర్ణ సుమన సుజ్ఞేయము - 777 (శ్రీమద్రామాయణ కల్పవృక్షము:కిష్కింధా కాండము: గజపుష్పి ఖండము) 1.గోరంటం బొనరింపనైన పనియున్ గొడ్డంట దీర్పంగనున్ / నేరంగల్గుటయే విచిత్రమగు నీ నీచంబు కార్యంబు నీ / వారంభించుట యిద్ది యిట్లనుచు నీకా చెప్పువారుండిరే / వారిం గూరిచి చెప్పగావలయుఁ దద్వైదగ్ధ్య సంభారముల్. / 2.కోమలమూర్తి నిన్ను గని కోపము వచ్చుట లేదుగాని నీ / యీ మలినంపుఁ గార్యమున కేమియుఁ జేసినఁ జేయవచ్చు ని / న్నా మెయినన్నెదిర్చి రణమాడవుగాని రణంబు లోపలన్ నీ / మృదుదేహమున్ మెదిపి నిర్మథనం బొనరించియుండనే. / 3.ఔరా ! యా యిక్ష్వాకువు / నా రఘువును నా దిలీపుడా దశరథుడు / వారల ప్రతిష్ఠ యేమిటి / వీరుడ వీ చెట్టుచాటు వెలిపని యేమీ? / 4.మా మాంసము తినియెదరో / మీ మానవులయిన పతులు మేము నభక్ష్యం / బౌ మృగపంచకమందు / న్నామయ్యా ! రామ ! పంచనఖములయందున్. / రామబాణంతో నేలగూలిన వాలి రాముడికి ప్రశ్నలను సంధించాడు. " రామా ! అసలు నువ్వు గోటితో పోయే దానికి గొడ్డలి ఉపయోగించటమే చిత్రంగా ఉంది. ఈ నీచమైన పనిని నువ్వు ఆరంభించటం, ఇది ఇట్లా చెయ్యమని నీకు చెప్పారే, వాళ్ళను గురించి, వాళ్ళ నేర్పరితనం గురించి చెప్పుకోవాలయ్యా ! కోమలమూర్తివైన నిన్ను చూస్తే కోపం రావటం లేదు గాని, నువ్వు చేసిన యీ పాపకార్యానికి మాత్రం నిన్నేం చేసినా చేయవచ్చయ్యా ! నువ్వు నాతో ఎదురుగా వచ్చి యుద్ధం చేయలేదు గాని, ఆ రకంగా చేసి ఉంటే, నీ దేహాన్ని మెదిపి ముద్దగా చేసి ఉండేవాడిని. అయ్యో ! ఆ ఇక్ష్వాకువు, రఘుమహారాజు, దిలీపుడు, దశరథుడు వంటి వారి కీర్తిప్రతిష్ఠ లేమిటి, మహావీరుడివి నువ్వు చెట్టుచాటు నుంచి చేసిన నీతిబాహ్యమైన పని యేమిటి? పోనీ, నా మాంసం కోసమని నన్ను చంపావా అంటే, మానవులు తిననటువంటి, ఐదు గోళ్ళు కలిగిన జంతుజాతికి చెందిన వాడిని నేను. " వాలి వధను గూర్చి సందేహాలు చాలామందికి కలుగుతుంటాయి. వాటన్నిటికీ, రాముడు దగ్గర నుంచే సమాధానాలు లభిస్తాయి. తమ్ముడి భార్యను బలవంతంగా గ్రహించినటువంటి అనాగరకపు చర్యకు పాల్పడినా, మర్యాదారాముడు వాలి అడిగిన అన్ని ప్రశ్నలకు సహేతుకమైన జవాబులు ఇస్తాడు. అధర్మవర్తనానికి పాల్పడిన వాలి, ధర్మమూర్తులైన ఇక్ష్వాకువు, రఘువు, దిలీపుడు, దశరథులను ప్రస్తావించటం, చావబోతున్న సమయంలో కూడా ఇంకా అతనిలో చావని అహంకారాన్ని తెలియజేస్తుంది. ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, కిష్కింధా కాండము, గజపుష్పి ఖండము లోనివి.

Subscribe to:
Post Comments (Atom)
like
-
తేజితబాణహస్తు , దృఢదీర్ఘమలీమసదేహు , గృ ష్ణాజినవస్త్రు , నస్త్రవిషయాస్తవిషాదు నిషాదు జూచి యా రాజకుమారు లందఱు బరస్పరవక్త్రవిలోకనక్ర...
-
భగవంతుడనగా సంపూర్ణుడు . " పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్పూర్ణ ముదుచ్యతే | పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే " అన...
-
క్వచిదష్టాపద వర్ణసైకత , క్వచిద్గంభీర పాథస్కయున్ , గ్వచిదుద్భ్రాంత విహంగసంతతి , క్వచిత్కాశ ప్రసూనాచ్ఛయున్ గ్వచితానీత ...
-
కార్యార్థిం గలిపించి చెప్పుదు ననంగా గాదు , మున్నెప్పుడో భార్యాయుక్తముగాగ నిన్ బరిచరింపం గన్నయట్లొప్పెడున్ మర్యాదాప్రియమైన నాయె...
-
ఆత్మజుడన్న తీయదనం బెఱుంగని చిత్తంబు ఱారూపు చేదుకట్టె ప్రియసుతుడన్న జాబిల్లి జూడని కన్ను లవి యప్రసన్నతాంధ్వంపు గూండ్లు కొడ...
No comments:
Post a Comment