నమృతాహరణ వేళ నా సుపర్ణుని ఱెక్కలో నంత తీవ్రత దేని వలన
మువ్విక్రమమ్ములు పోవు వామనదేవు ధృతి నంత విస్తృతి దేని వలన
విధు సుధోత్పాదన వేళ నాదిత్యపంక్తికి నంత విజయమ్ము దేని వలన
వఱలెనో మాతృదేవి దీవెనను దానిఁ
గొనుమురా తండ్రి ! ఋతువులు వనధిచయము
ద్వీపములు వేదములు లోకవితతు లెల్ల
నో మహాబాహు ! నీకు శుభోల్బణములు.
వనవాసానికి వెళ్తున్న కొడుకు రామచంద్రుడిని తల్లి కౌసల్య దీవిస్తున్న సందర్భం లోని పద్యమిది.
" వృత్రాసురునితో పోరు సలిపినపుడు ఇంద్రుని వజ్రాయుధానికి అంత పదును దేని వలన కలిగిందో, అమృతాన్ని అపహరించే సమయంలో గరుడుని రెక్కకు అంత వేగం దేనివలన కలిగిందో, మూడడుగులతో ముల్లోకాలను కొలిచిన త్రివిక్రముడు వామనుని ధైర్యానికి అంత విరివి దేని వలన సమకూరిందో, క్షీరసాగరాన్ని చిలికి అమృతాన్ని పొందిన వేళ దేవతల సమూహానికి అంత విజయం దేని వలన సిద్ధిచిందో, అటువంటి మాతృదీవెనను తీసుకో నాయనా ! ఓయీ ఆజానుబాహుడా ! ఋతువులు, సముద్రాలు, ద్వీపాలు, వేదాలు, లోకాలు - అన్నీ నీకు శుభాన్ని కలుగజేయును గాక ! "
సనాతన ధర్మంలో మాతృదేవిది ప్రథమస్థానం. పైన పేర్కొనబడిన మహాకార్యాలన్నీ మాతృదీవెన వల్లనే సుసాధ్యమయినవన్నది సుస్పష్టం.
ఈ సీసపద్యం శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అయోధ్యా కాండము, అభిషేక ఖండము లోనిది.
No comments:
Post a Comment