ఏ పరమేశుచే జగము లీ సచరాచరకోటిచే సము
ద్దీపితమయ్యె; నే విభుని దివ్యకళాంశజు లబ్జగర్భ గౌ
రీపతి ముఖ్యదేవ ముని బృందము; లెవ్వ డనంతు డచ్యుతుం
డా పురుషోత్తముండు గరుణాంబుధి గృష్ణుడు పో నరేశ్వరా!
' పోతన్న తెలుగుల పుణ్యపేటి ' అన్నారు విశ్వనాథ. ఇది అక్షరసత్యం. మనస్సు లయం చేసి, పాడుకొని, తన్మయత్వం చెందడానికి ఎన్ని పద్యాలు .......ఎన్నెన్ని పద్యాలు. వినగానే, " ఎవ్వనిచే జనించు జగము " పద్యాన్ని తలపించే ఎత్తుగడతో ఉన్న యీ పద్యము శ్రీమదాంధ్రమహాభాగవతము తృతీయస్కంధము లోనిది.
పాండవులకు వారి రాజ్యాన్ని వారి కివ్వమని విదురుడు ధృతరాష్ట్రునికి హితోపదేశం చేసి, శ్రీకృష్ణుని పరమేశ్వర తత్వాన్ని తెలియజేసిన సందర్భములోనిది.
స్తుతిపూర్వకమైన యీ పద్యము యొక్క అర్థము సుగమం.
No comments:
Post a Comment