సిన వారికంటె నక్రోధనుడ గరం బధికు డండ్రు తత్వవిధిజ్ఞుల్.
అలిగిన, నలుగక యెగ్గులు పలికిన మఱి విననియట్ల ప్రతివచనంబుల్
వలుకక, బన్నము వడి యెడ దలపక యున్నతడు చూవె ధర్మజ్ఞు డిలన్.
ఆదికవి నన్నయ కవిత్వంలోని మూడు ప్రధాన లక్షణాలలో నానారుచిరార్థ సూక్తి నిధిత్వం ఒకటి.
పై రెండు పద్యాలు ఆంధ్ర మహాభారతము, ఆదిపర్వము, తృతీయాశ్వాసము లోనిది.
రాక్షసులకు రాజయిన వృషపర్వుని కూతురు శర్మిష్ఠ, మాట పట్టింపుపై రాక్షసుల గురువైన శుక్రాచార్యుని కూతురు దేవయానిని, ఒక పాడుబడిన నూతిలో పడదోస్తుంది. యయాతి మహారాజు సహాయంతో నూతినుండి బయటకు వచ్చిన దేవయాని అవమానభారంతో నగరం లోనికి రావడానికి నిరాకరిస్తుంది. ఇది తెలిసికున్న శుక్రుడు కుమార్తె వద్దకు వచ్చి అనునయ వాక్యాలు పలికిన సందర్భ మిది.
"సాటిలేని నియమంతో కూడినవారై, యజ్ఞాలలో అనేక దక్షిణలు ఇచ్చిన వారికంటె, కోపము లేనివాడు మిక్కిలి గొప్పవాడని ధర్మము తెలిసినవారు చెబుతారు. ఇతరులు కోపిస్తే కోపించకుండా, నిందావాక్యాలు పలికితే మారు మాట్లాడకుండా, అవమానం పొందికూడా, దానిని మనసులో పేట్టుకోకుండా ఉన్నవాడే ధర్మము తెలిసినవాడు.", అని శుక్రాచార్యులు కుమార్తెను అనునయించడానికి ప్రయత్నిస్తాడు.
మనిషిని మనీషిగా తీర్చిదిద్దే ఇటువంటి పద్యాలు మనకు నన్నయ భారతములో విరివిగా కనిపిస్తాయి.
No comments:
Post a Comment